Thursday, December 26, 2024

టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసులను త్వరితగతిన మంజూరు చేయాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ :- టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసు మంజూరులో జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్ట లోని కార్పొరేట్ విద్యుత్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, గణపతి, సంధ్యారాణి,మోహన్ రెడ్డి,తిరుపతిరెడ్డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్ ఈలతో, డిఈలతో, ఎస్‌ఏఓలతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సి.యం.డి అన్నమనేని గోపాల్ రావు మాట్లాడుతూ.. టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసుల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని త్వరితగతిన మంజూరు చెయలని అన్నారు.

దత్తత తీసుకున్న గ్రామాలలో సమస్యలను పరిష్కరించి,పనులను వెంటనే పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోని, కాలిపోయిన, పనిచేయని మీటర్ల ను మార్చాలని అన్నారు. రెండు సంవత్సరాలు పై బడిన వర్క్ ఆర్డర్లు ను పూర్తి చెసి, రూ.50,000 పై బడిన మొండి బకాయిలను వసూళ్ళు చెయలని సూచించారు. 33/11 కెవి అంతరాయాలను కలుగకుండా చూడాలని, ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లలపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు లైన్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ఐఆర్డీఏ కాని మీటర్లను మార్చి, అపార్ట్మెంట్ల పరంగా ఎనర్జీ ఆడిట్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ డి ,పి ఎంఎం డైరెక్టర్ బి.వెంకటేశ్వర రావు, ఐపిసి ఆర్‌ఎసి డైరెక్టర్ పి.గణపతి, కమర్షియల్ డైరెక్టర్ పి.సంధ్యారాణి, ప్రాజెక్ట్స్, ఆపరేషన్ డైరెక్టర్ పి.మోహన్ రెడ్డి, ఫైనాన్స్ ఇంచార్జ్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, సి.జి.యంలు, ఎస్‌ఈలు, డీఈలు, ఎస్‌ఏఓలు, డిఈ(ఐటి) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News