Saturday, December 21, 2024

గర్భిణి అభ్య‌ర్థుల‌కు టిఎస్ఎల్‌పిఆర్‌బి అప్ డేట్.. రాత‌పూర్వ‌క హామీ ప‌త్రాన్ని ఇవ్వాల్సిందే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలింత, గ‌ర్భిణి అభ్య‌ర్థుల‌కు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క స‌మాచారం అందించింది. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వ‌హించిన ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో క్వాలిఫై అయిన మ‌హిళా అభ్య‌ర్థుల్లో ప‌లువురు గ‌ర్భం ధ‌రించ‌డం, ప్ర‌స‌వించడం జ‌రిగింది. ఈ నేపథ్యంలో ఫిజిక‌ల్ ఈవెంట్స్ కోసం పార్ట్ 2 కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అయితే పార్ట్ 2 కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న గ‌ర్భిణులు, బాలింత‌లు ఫైన‌ల్ ప‌రీక్ష‌లకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.  హైకోర్టు ఆదేశాల మేర‌కు బాలింత‌లు, గ‌ర్భిణులు త‌మకు సంబంధించిన మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల‌ను జ‌న‌వ‌రి 31వ తేదీలోపు హైద‌రాబాద్‌లోని డీజీపీ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల‌ని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫైన‌ల్ ప‌రీక్షల్లో కూడా అర్హ‌త సాధించిన‌ట్లైతే అలాంటి అభ్య‌ర్థులు నెల రోజుల్లోపు ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాత‌పూర్వ‌క హామీ ప‌త్రాన్ని కూడా మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల‌తో జ‌త‌ప‌రచాలని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News