Friday, December 27, 2024

ఉద్యోగ నామ వత్సరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో 2022లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. డిసెంబర్ 31 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 18,263 ఉద్యోగాల భర్తీకి 26 నోటిఫికేషన్లు జారీ చేసిం ది. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూసి న తెలంగాణ మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్‌తో సహా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో పోస్టులతో ప్రకటనలు వెలువడ్డాయి. వీటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, మరికొన్నింటికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన గ్రూప్ 2, గ్రూప్ 3, లైబ్రేరియన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిజికల్ డైరెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2022 లో వెలువడిన నోటిఫికేషన్లకు 2023లో పరీక్షలు జరుగనున్నా యి. 2022లో వెలువడిన నోటిఫికేషన్లలో ఇప్పటివరకు గ్రూప్ 1 ప్రిమిలినరీ పరీక్ష మాత్రమే జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి తుది కీ విడుదలైనప్పటికీ మహిళా రి జర్వేషన్ల న్యాయస్థానంలో కే సు ఉన్నందున మెయిన్స్ ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇంకా వెలువడలేదు.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తామని టిఎస్‌పిఎస్‌సి ప్రకటించగా, ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడని కారణంగా మ రో రెండు, మూడు నెలలు అంటే ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది. తెలంగా ణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెలువడిన నోటిఫికేషన్లకు 2023 ఏడాదంతా పరీక్షలు జరుగనున్నాయి. వాటితో పాటు నియామకాలు జరగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, హా స్టల్ వెల్ఫేర్, లైబ్రేరియన్, హార్టికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆ ఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డివిజనల్ అ కౌంట్స్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఉమెన్ అం డ్ ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిజికల్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు జరుగనున్నాయి. ఇందులో కొన్ని పరీక్షలు తేదీలు ఖరా రు కాగా, మరికొన్నింటికీ ఖరారు కావాల్సి ఉం ది. ఫిబ్రవరి 26వ తేదీన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష జరుగనుంది. గ్రూప్ 2,గ్రూప్ 3,గ్రూప్ 4 పరీక్షలు ఏప్రిల్ లేదా మే నెలలో జరుగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఈ నెలలో వెలువడిన మెయిన్స్ పరీక్షలు కూడా మే లేదా జూన్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెస్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరికొన్ని పరీక్షలు జరుగనున్నాయి.
ఆఫ్‌లైన్‌లోనే పరీక్షల నిర్వహణ
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు 2022లో వచ్చిన నోటిఫికేషన్లు ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ము ఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కొద్ది రో జుల్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అప్పటి నుం చి ప్రకటనల పరంపరం కొనసాగుతూనే ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వివిధ శాఖలలో ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతిస్తుండగా, టిఎస్‌పిఎస్‌సి క్రమం గా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వూలు తొలగిస్తూ ప్రభు త్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారీగా నోటిఫికేషన్లు వెలువడుతుండటం, కొత్త జోనల్ విధానంతో స్థానికులకే అవకాశాలు రావడం, ఇంటర్వూలు లేకపోవడం వంటి కారణాలతో అభ్యర్థులు భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరిమితంగా దరఖాస్తులు ఉన్న నోటిఫికేషన్లకు టిఎస్‌పిఎస్‌సి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే టెక్నికల్ పోస్టులు మిన హా, సాధారణ డిగ్రీ,పిజి వంటి అర్హలతో భర్తీ చేసే ప్రభు త్వ ఉద్యోగాలకు మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దాంతో మెజారిటీ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించవలసిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకు జారీ చేసిన నోటిఫికేషన్లు
నోటిఫికేషన్ పోస్టులు
గ్రూప్- 1 503
ఫుడ్ సేఫ్టీ అధికారులు 24
ఫారెస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ 27
మహిళా శిశు సంక్షేమ అధికారులు 23
మహిళా శిశు సంక్షేమం అక్స్‌టెన్షన్ ఆఫీసర్ 181
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 1540
అసిస్టెంట్ ఇంజనీర్లు 837
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ 53
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 175
వివిధ గెజిటెడ్ పోస్టులు 32
నాన్ గెజిటెడ్ పోస్టులు (గ్రౌండ్ వాటర్ ) 25
గ్రూప్ 4 9168
పాలిటెక్నిక్ లెక్చరర్లు 247
డ్రగ్ ఇన్స్పెక్టర్లు 18
జూనియర్ లెక్చరర్లు 1,392
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు 185
హార్టీకల్చర్ అధికారులు 22
హాస్టల్ వెల్ఫేర్ అధికారులు 581
ఫిజికల్ డైరెక్టర్లు 128
అగ్రికల్చర్ ఆఫీసర్లు 148
గ్రూప్ 2 783
గ్రూప్ 3 1365
అకౌంట్స్ ఆఫీసర్ 78
లైబ్రేరియన్(ఇంటర్ విద్య) 71
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్,
పిడి(కళాశాల విద్య) 544
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ 113
మొత్తం 18,263

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News