Monday, January 20, 2025

టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ అభ్యర్థుల ఫైనల్ కీ

- Advertisement -
- Advertisement -

వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 2023లో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ ని గురువారం టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. ఈ రాతపరీక్షకు సంబంధించి నవంబర్ 1, 2023న ప్రిలిమినరీ కీ ని విడుదల చేయగా నవంబర్ 2 నుండి 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు.

అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఫైనల్ కీ ను తయారు చేసినట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. ఫైనల్ కీస్ తో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్‌ను కమిషన్ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయని, మరిని వివరాలకు వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News