Monday, December 23, 2024

మే నెలలో ఏఈఈ సివిల్ పరీక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (ఏఈఈ) పోస్టులకు ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించాలని టిఎస్‌పిఎస్సీ నిర్ణయించింది. మే 21వ తేదీన ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానిక్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించాలని పేర్కొంది.

మే 21, 22 తేదీలో రెండు సెషన్స్‌లో ఏఈఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. తుది స్కోరు ఖరారులో సాధారణ పద్దతి పాటించాని పేర్కొంది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానిక్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News