Wednesday, January 22, 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు వచ్చేశాయ్

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి). బుధవారం గ్రూప్ 1,2,3 పరీక్షల తేదీలను ఖరారు చేసింది.టిఎస్పిఎస్సి తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది.  అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇక, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు.. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనుంది.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ తోపాటు సభ్యులను సర్కార్ నియమించింది. దీంతో టిఎస్పిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News