నోటిఫికేషన్లు వెలువడిన ఎనిమిది నెలల్లో భర్తీ
ప్రక్రియ పూర్తి త్వరలో గ్రూప్1,2,3 ఫలితాలు
విడుదల రెండురోజుల్లో గ్రూప్2 కీ
మీడియాతో టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మే 1 నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31లోపు ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గతంలో మాదిరిగా ఫలితాల విడుదలలో జాప్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారం ఫలితాలు ఇచ్చేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషనుల ఇచ్చి 6 ను ంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వచ్చే వారం పదిరోజుల తేడాతో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు విడుదల చేస్తామన్నారు.రెండు రోజుల్లో గ్రూప్ 2 కీ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. టిజిపిఎస్‌సి సిలబస్‌పై కూడా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.