Monday, December 23, 2024

పేపర్ లీక్.. టిఎస్‌పిఎస్‌సి సంచలన నిర్ణయం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో జరిగే పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని కమీషన్ భావిస్తోంది. అయితే ఏప్రిల్‌లో జరిగే పరీక్షల ప్రశ్నాపత్రాలు మార్చాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. పేపర్ లీక్ కేసు నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో 5 ప్రశ్నాపత్రాలు సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ నెల 5న జరిగిన ఎఇ పరీక్షను రద్దు చేసింది.

ఈ క్రమంలో మరో 4 విభాగాల పరీక్షా పత్రాలు మార్చాలని నిర్ణయించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రాసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే పేపర్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లుగా పోలీసులు తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News