కొత్త పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యలను
గవర్నర్‌కు వివరించిన ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) 2020 2021 వార్షిక నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేసింది. మంగళవారం కమిషన్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలో సభ్యులు గవర్నర్‌ను కలిసి నివేదిక అందజేశారు.ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల భర్తీ తీసుకుంటున్న కమిషన్ ఛైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు. 2020 21లో ఇప్పటివరకు 3 నోటిఫికేషన్లు జారీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. 149 పోస్టులను నోటిఫై చేసినట్లు తెలిపారు. 119 పోస్టుల భర్తీకి నాలుగు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,630 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్లతో కలిపి 2,370 పోస్టులను భర్తీని చేపట్టినట్లు తెలిపారు.
డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు 1,26,381 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 53,886 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 90 క్రమశిక్షణ కేసులు స్వీకరించగా, అందులో 80 కేసులు పరిష్కరించినట్లు నివేదికలో తెలిపారు. అలాగే 136 కోర్టు కేసులకు గానూ పాత కేసులతో కలిపి 164 కేసులు పరిష్కారమయ్యాయరని గవర్నర్‌కు నివేదించారు. సివిల్ సర్వీసెస్ అర్ధవార్షిక పరీక్షకు 20 మంది హాజరైనట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు రమావత్ ధన్‌సింగ్,బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, కారం రవీందర్‌రెడ్డి, డాక్టర్ అరవెళ్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణ, కార్యదర్శి అనిత రామచంద్రన్ ఉన్నారు. ఈ సందర్భంగా కమిషన్ ఛైర్మన్, సభ్యులను గవర్నర్ అభినందించారు.