Sunday, January 19, 2025

అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రావాణా శాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జూన్ 12, 13 తేదీలలో ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ఎంజె రోడ్డులోని పబ్లిక్ సర్వీస్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. వెబ్ ఆప్షన్ కోసం జూన్ 10 నుండి 13 వరకు లింక్ ను అందించబడుతుందని తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో కమిషన్ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉన్న చెక్ లిస్ట్, అటెస్టేషన్ ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసి తీసుకురావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News