Monday, December 23, 2024

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు..

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 నోటిఫికేషన్ ను టిఎస్పిఎస్సి రద్దు చేసింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 503 పోస్టులతో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్ ను ఇటీవల కొత్తగా ఏర్పాటు అయిన టిఎస్పిఎస్సి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టిఎస్పిఎస్సి ఓ ప్రకటన విడుదల చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 560 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన బోర్డు.. పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ ను టిఎస్పిఎస్సి విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News