Wednesday, January 22, 2025

గ్రూప్-1 ప్రిలిమ్స్, మరో రెండు పరీక్షలు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్‌తో పాటు పాటు ఎఈఈ, డిఎఓ పరీక్షలను రద్దు చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నాపత్రాల లీకేజీల దృష్ట్యా కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏఈ,టిపిబిఓ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను గతేడాది అక్టోబర్ 16న నిర్వహించగా, ఏఈఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 22న,డిఎఓ పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహించారు. శుక్రవారం ఉదయం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కమిటీ సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గ్రూప్-1, ఎఈఈ, డిఎఓ పరీక్షలను రద్ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News