Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన ఐదు ఉద్యోగ నియామక పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది. ఈ నెల 23న జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష జూన్ 28న నిర్వహిస్తున్నట్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష మే 16న నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈనెల 26, 27 తేదీల్లో జరగాల్సిన భూగర్భ జలశాఖ గెజిటెడ్ పోస్టుల పరీక్ష జూలై 18, 19న జరపనున్నట్లు తెలిపింది. మే 7న నిర్వహించే డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష మే 19వ తేదీన, మే 15, 16న జరగాల్సిన భూగర్భ జలశాఖ నాన్ గెజిటెడ్ పరీక్ష జూలై 20, 21న జరుపుతున్నట్లు కమిషన్ పేర్కొంది. నెల రోజు కితం టిఎస్‌పిఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలు రద్దు చేయగా, మరికొన్నింటిని వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News