Wednesday, January 22, 2025

హ్యాకింగ్ అనుమానంతో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : హ్యాకింగ్ అనుమానంతో ఆదివారం(మార్చి 12) జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఒవర్‌సీర్(టిపిఒబి) పరీక్షను టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసింది. అలాగే ఈ నెల 15,16 తేదీలలో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.

ఈ పరీక్షలకు సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని, ఈ మేరకు హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టిఎస్‌పిఎస్‌సి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News