Sunday, December 22, 2024

ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో కౌంటరు దాఖలు చేసిన టిఎస్‌పిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా శనివారం హైకోర్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కౌంటర్ దాఖలు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు వేసిన కమిషన్ సిబిఐకి బదిలీ చేయాలన్న వెంకట్ పిటిషన్‌ను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. సమాచారం బయటకు వెళ్లిందన్న అనుమానంతో కేసు పెట్టామని, ముందస్తు చర్యగా 4 పరీక్షలు రద్దు చేసినట్లు తెలిపింది. పేపర్ లీకేజీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేసింది. సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News