Saturday, December 28, 2024

ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు 24 మందిని టిజిపిఎస్‌సి ఎంపిక చేసింది. ఐపీఎం పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 జులై 21న నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 16, 381 మంది దరఖాస్తు చేయగా… 2022 నవంబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. మంగళవారం తుది ఫలితాలను ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News