Thursday, January 23, 2025

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఖరారు..

- Advertisement -
- Advertisement -

జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్ మెయిన్స్
పరీక్షల తేదీలు ఖరారు చేసిన టిఎస్‌పిఎస్‌సి
ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షల నిర్వహణ
జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్‌లు
అభ్యర్థులు ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది.

ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంలో రిజర్వేషన్లు చేపట్టినట్లు కమిషన్ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్

జూన్ 5         జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష),
జూన్ 6         జనరల్ ఎస్సే (పేపర్-1),
జూన్ 7         హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ (పేపర్-2),
జూన్ 8         ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3),
జూన్ 9          ఎకానమీ అండ్ డెవలప్‌మెట్ (పేపర్-4)
జూన్ 10        సైన్స్ & టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్ (పేపర్-5),
జూన్ 12        తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్-6)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News