Monday, January 20, 2025

రెండు, మూడు రోజుల్లో గ్రూప్-1 నోటిఫికేషన్..

- Advertisement -
- Advertisement -

TSPSC Group-1 Notification 2022 to Release Soon

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో వెలువడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం లేదా మండళవారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఒకటి, రెండు శాఖల నుంచి టిఎస్‌పిఎస్‌సి కొన్ని సవరణ లు కోరగా, ఆయా శాఖల నుంచి సోమవారం నివేదికలు అందే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి నివేదికలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రధానంగా గ్రూప్ 1 నోటిఫికేషన్‌పైనే చర్చించినట్లు తెలిసింది.

TSPSC Group-1 Notification 2022 to Release Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News