Monday, December 16, 2024

గ్రూప్ 2కు దరఖాస్తుల వెల్లువ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఉద్యోగాలకు గురువారం దరఖాస్తు గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 29న టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించగా, శుక్రవారం (ఫిబ్రవరి 16)తో దరఖాస్తు ముగిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 తర్వాత గ్రూప్-2 ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.

నాయబ్ తహసీల్దార్, ఎసిటిఇ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎస్‌ఐ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మండల పంచాయతీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు గ్రూప్- 2 ద్వారా భర్తీ చేస్తారు. గత నోటిఫికేషన్ ద్వారా సుమారు 1032 పోస్టులను భర్తీ చేశారు. అదేవిధంగా గత నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూ ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇంటర్వూలు రద్దు చేసిన నేపథ్యంలో కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందనున్నారు. దీంతో గ్రూప్ 2కు దరఖాస్తులు వెల్లువెతాయి. గ్రూప్ 2కు ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. మొత్తం 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-2లో ప్రశ్నలు అన్ని మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి.

4 లక్షలకు చేరువలో గ్రూప్ 3 దరఖాస్తులు
గ్రూప్ 3 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పోస్టులకు బుధవారం నాటికి 3,83,537 మంది దరఖాస్తు చేసుకోగా, గురువారం నాటికి నాలుగు లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. 1,363 గ్రూప్-3 పోస్టులకు జనవరి 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ నెల 23తో దరఖాస్తు గడువు ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News