Friday, December 20, 2024

టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-2 కొత్త షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్‌, కార్యదర్శితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం అర్థరాత్రి సమావేశమై పరీక్షను నవంబర్‌కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రాగా.. ఈ మేరకు టిఎస్‌పిఎస్‌సి కొత్త తేదీలు ప్రకటించింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News