రాష్ట్రంలో ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న గ్రూప్ 3 పరీక్షల హాల్ టికెట్లను టిజిపిఎస్సి విడుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 నిర్వహించనున్నారు.ఈ పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఉదయం సెషన్లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు.. ఆ తర్వాత అభ్యర్థులు పరీక్షా కంద్రాల్లో ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు. అభ్యర్థులు టిజిపిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలని, తొలిరోజు పేపర్- 1 పరీక్షకు హాజరైన హాల్ టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రంలో దాదాపు 1380 గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
పరీక్షా విధానం ఇదే..
గ్రూప్- 3 పరీక్షలో మెుత్తం మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. ఈ మూడు పేపర్లకు కలిపి 450 మార్కులు ఉంటాయి. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు ఒక్కో పేపర్ రాసేందుకు రెండన్నర గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలు మూడు భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయి. గ్రూప్ -3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు ఉద్యోగం సాధిస్తారు.ఈ పరీక్షలో జనరల్ నాల్జెడ్, భారత రాజ్యాంగం, భారత చరిత్ర, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.