Friday, December 20, 2024

గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాత‌ర నెలకొంది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. నిన్న గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా, శుక్రవారం గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. తాజాగా 1365 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని సూచించింది. 783 గ్రూప్-2 పోస్టుల‌కు నిన్న నోటిఫికేష‌న్ విడుద‌లైన ముచ్చట తెలిసిందే. ఇతర వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

TSPSC Group 3 Notification 2022 Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News