Sunday, January 19, 2025

గ్రూపు-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూపు -4లో దరఖాస్తుల్లో తప్పులు సవరించేకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చివరి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీవరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తులో తప్పులు సవరించేందుకు మరోసారి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

మొత్తం 8180 గ్రూపు 4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈపరీక్ష జూలై 1న జరగనుండగా అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఉద్యోగం సాధించేందుకు కుస్తీ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News