నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ
2023 ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. 9,168 గ్రూప్- 4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. 2023 ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ వెల్లడించింది. గ్రూప్ -4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా 9,168 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, గురువారం టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రూప్ 4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈమేరకు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్- 4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన గ్రూప్ -4 నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ పోస్టులు భారీగా ఉన్నాయి.
శాఖల వారీగా గ్రూప్ -4 ఉద్యోగాలు
క్ర. సంఖ్య శాఖ పోస్టుల సంఖ్య
1. వ్యవసాయం, సహకార శాఖ 44
2. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ 2
3. బిసి సంక్షేమం 307
4. పౌరసరఫరాలు 72
5. విద్యుత్ 2
6. అడవులు, పర్యావరణం 23
7. ఆర్ధిక 46
8. సాధారణ పరిపాలన 5
9. వైద్య, ఆరోగ్యం 338
10. ఉన్నత విద్య 742
11. హోం 133
12. పరిశ్రమలు 7
13. నీటిపారుదల 51
14. కార్మిక, ఉపాధిశిక్షణ 128
15. మైనార్టీ సంక్షేమం 191
16. మున్సిపల్, పట్టణాభివృద్ధి 2,701
17. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 1245
18. పణాళిక శాఖ 2
19. రెవిన్యూ 2,077
20. ఎస్‌సి సంక్షేమం 474
21. సెకండరీ ఎడ్యుకేషన్ 97
22. రవాణా, ఆర్ అండ్ బి 20
23. గిరిజన సంక్షేమం 221
24. మహిళ, శిశు సంక్షేమం 18
25. యువజన, పర్యాటక, సాంస్కృతిక 13