Monday, November 18, 2024

గ్రూప్ 4కు దరఖాస్తుల వెల్లువ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. గ్రూప్ 4 నోటిఫికేషన్‌లో మొదట 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించగా, డిసెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పోస్టులు పెరిగి 8,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్ 4 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి.

దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 30న ప్రారంభం కాగా, మొదటి రోజు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు నుంచి దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ 31వ తేదీన 19,535 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 1న 13,324 దరఖాస్తులు, జనవరి 2న 40,762, 3న 30,262,4న 31,438, 5న 34,010, 6న 35,107, 7న 30,114 మంది దరఖాస్తు చేసుకోగా, ఆదివారం సాయంత్రం వరకు 14,402 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు ప్రారంభమైన వారం రోజుల్లో మొత్తం 2,48,955 దరఖాస్తులు వచ్చాయి.దరఖాస్తుల స్వీకరణకు ఇంకా చాలా రోజులు సమయం ఉండడంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News