Saturday, December 21, 2024

గురుకుల పిజి సెంటర్‌లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల లా అండ్ పిజి సెంటర్‌లో లెక్చరర్ పోస్టులకు గాను అర్హులైన, అనుభవజ్ఞులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. పోలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంటల్ లా / లీగల్ లాంగ్వేజ్ రైటింగ్, హిస్టరి, హిస్టరి ఆఫ్ కోర్ట్, ఎవిడెన్స్ సబ్జెక్టులలో లెక్చరర్ పోస్టుల కోసం మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. బిఎ(ఎల్‌ఎల్‌బి) 5 సంవత్సరాల కోర్సు, పిజి ఫిజికల్ కెమెస్ట్రి సబ్జెక్టును అతిథి ఫ్యాకల్టీగా (పూర్తి సమయం) బోధించాల్సి ఉంటుంది.

లెక్చరర్ పోస్టుకు నెలకు జీతం రూ. 32,500, లైబ్రేరియన్ పోస్టుకు వేతనం నెలకు రూ. 26,000లు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సివిని ప్రిన్సిపాల్, తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల, పిజి సెంటర్ చైతన్యపురి, హైదరాబాద్ కు వ్యక్తిగతంగా లేదా prl————rdcwlbngrswrs@telangana.gov.in మెయిల్‌లో పంపవచ్చన్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పోస్టు భర్తీ చేయనున్నారు,.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News