Monday, January 20, 2025

జెఎల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఈ నెల 20 నుంచే జూనియర్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణ రాష్ట్రపబ్లిక్ సరీస్ కమిషన్ స్పష్టం చేసింది. తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు నిన్న శుక్రవారం నుండి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం నాడు ప్రకటించింది.

అంతే కాకుండా స్వీకరణ కొంత ఆలస్యమైన నేపథ్యంలో దరఖాస్తు గడువును జనవరి 6 నుంచి జనవరి 10కి పొడిగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారిగా జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జెఎల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008 ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News