Monday, December 23, 2024

గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివారాలను వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో 1,924 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన విషయం విదితమే. అందులో మెరిట్ జాబితాను ఈ నెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ధృవ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు సైతం నిర్వహించింది. దీంతో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా గురువారం తుది ఫలితాలను వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News