Wednesday, January 22, 2025

జెఎల్ పరీక్ష పేపర్‌లో సిలబస్‌లో లేని ప్రశ్నలు: నిరుద్యోగ ఆవేదన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జెఎల్ పరీక్షలో మొదటి పేపర్ ఇంగ్లీషులో సిలబస్‌లో లేని ప్రశ్నలే ఎక్కువగా రావడం బాధాకరమని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే టిఎస్‌పిఎస్సీ అధికారులు ప్రశ్నపత్రాన్ని సమీక్షించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు తొలగించి కట్ ఆఫ్ మార్కులను తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఎల్ అభ్యర్థులు ప్రణీత్ ,అంజి యాదవ్, రాజేష్, నరేందర్, షబ్బీర్, నరేష్, చిరంజీవి, నాగరాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News