Monday, January 20, 2025

జెఎల్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు టిజిపిఎస్‌సి విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెం ట్ టెస్ట్(సిబిఆర్‌టి) విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తె లిసిందే. తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జిఆర్‌ఎల్)ను సబ్జెక్టుల వారీగా టిజిపిఎస్‌సి సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాం కుల జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1ః2 నిష్పత్తిలో, పిడబ్లూడీ అభ్యర్థులకు 1ః5 నిష్పత్తిలో జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News