Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి సభ్యులు కారం రవీందర్‌ రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో వరుస పేపర్ లీకేజీలతో సంచలనంగా మారిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులోని సభ్యుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా బోర్డు సభ్యులు కారం రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారు. కమిషన్‌లో చోటు చేసుకున్న అపవాదును సంబంధంలేని వారు కూడా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు వ్యక్తుల తప్పిదంవల్ల బోర్డు మనుగడే ప్రశ్నార్థకంగా మారందని కారం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేదనే సంస్థలో జరిగిన పరిణామాలను తమకు ఆపాదించారని విమర్శించారు. టిఎస్‌పిఎస్‌సిలో సరిపడా సిబ్బంది లేకపోయినా నిరుద్యోగులకు మంచి జరగాలనే ఉద్దేశంతో నియామక ప్రక్రియ వేగమంతం చేశామని పేర్కొన్నారు. నిరుద్యోగులకు టిఎస్‌పిఎస్‌సిపై ఉన్న అపోహను పక్కన పెట్టాలని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News