Sunday, January 5, 2025

మున్సిపల్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల మెరిట్ జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల జనరల్ ర్యాంక్ మెరిట్(జిఆర్‌ఎల్) జాబితాను టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. మొత్తం 12,186 మంది అభ్యర్థుల జిఆర్‌ఎల్‌ను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర వివరాలకు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని పేర్కొంది.

అవసరమైన ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోండి
వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన జనరల్ ర్యాంక్ మెరిట్(జిఆర్‌ఎల్) జాబితాలను విడుదల చేసిన నేపథ్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని టిఎస్‌పిఎస్‌సి సూచించింది. కుల ధృవీకరణ పత్రం, అగ్రవర్ణ పేదలు ఇడబ్లూఎస్, బిసిలు నాన్ క్రిమిలేయర్, స్టడీ సర్టిఫికెట్లు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News