Monday, December 23, 2024

పేపర్ లీకేజీ కేసు.. 3 పేపర్లు.. రూ.10 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి రోజు కోక కీలక విషయం వెలుగుచూస్తోంది. తాజాగా డిఇ రమేశ్ అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. 3 పేపర్లు లీక్ చేసి రూ.10 కోట్లు సంపాదిం చాలని ఇతను స్కెచ్ గీసినట్లు సిట్ పేర్కొంది. ఎఇతో పాటు డిఎవొ పేపర్లను లీక్ చేశాడు రమేష్. ఇందుకు గాను ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.20 నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే 30 నుంచి 50 మంది అభ్యర్ధులతో ఈ డీల్ మాట్లాడినట్లుగా సిట్ పేర్కొం ది. అడ్వానడ్స్ టెక్నాలజీతో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశాడని తెలిపింది. పరీక్ష సెంటర్ల ఇన్విజిలేటర్స్‌ను ట్రాప్ చేశాడని, ఇందుకు గాను వారికి ముందుగానే డబ్బులు చెల్లించాలని పేర్కొంది. దీంతో పరీక్ష పేపర్ ఇచ్చిన 5 నిమిషాలకే రమేష్ వద్దకు పేపర్ చేరిందని సిట్ వెల్లడిం చింది. అనంతరం చాట్‌జీపీటీ ద్వారా జవాబులు తెలుసుకుని అభ్యర్థులకు చేరవేశాడని తెలిపింది.

అంతేకాదు పేపర్ల లీకేజీ కోసం డిఇ రమేష్ ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పేర్కొంది. పెద్దపల్లిలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఇతను డిఇగా పనిచేస్తున్నాడని తెలిపింది. ఇప్పటికే భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. అలాగే రమేశ్‌కు సహకరించిన వారి కోసం సిట్ ఆరా తీస్తోంది. ఇదిలావుండగా టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి టిఎస్‌పిఎస్‌సి సంచలన నిర్ణయం తీసుకుంది. అరెస్ట్ అయిన 37 మందిని డీబార్ చేయాలని నిర్ణయించింది. వారు భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని డిసైడ్ అయ్యింది. అభ్యంతరాలుంటే 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సదరు 37 మందికి నోటీసుల్లో పేర్కొన్న విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News