Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసు…. 17కు చేరిన అరెస్టులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 17కి చేరింది. డిఎఒ పేపర్ కొనుగోలులో లౌకిక, సుస్మితలను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ నుంచి పేపర్‌ను ఆరు లక్షల రూపాయలు కొన్నట్లు గుర్తించారు.  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి)లో లీకేజీ వ్యవహారంలో టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగి ప్రవీణ్ తో ఎ1 గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 16 మందిని సిట్ అరెస్ట్ చేసింది. టిఎస్ పిఎస్‌సి పేపర్ లీక్ అంశానికి సంబంధించి సిట్ బృందం విచారణ చేస్తుంది. పేపర్ లీక్ అంశానికి సంబంధించి కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News