Sunday, December 22, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసు: మరొకరిని అరెస్టు చేసిన సిట్ అధికారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు విచారణలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటికి వస్తున్నాయి. లీకేజీ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధీ హామీ విభాగంలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్ ను సిట్ అరెస్టు చేసింది. పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 13కు చేరింది. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్ ను అరెస్టు చేశారు. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్.. గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News