హైదరాబాద్: టిజెఎస్ విద్యార్థి విభాగం, బిజెపి యువ మోర్చా కార్యకర్తలు టిఎస్‌పిఎస్‌సి ఆఫీస్‌ను ముట్టడించారు. ప్రశ్నాపత్రం లీక్‌ను నిరసిస్తూ ముట్టడికి టిజెఎస్, యువ మోర్చా కార్యకర్తలు యత్నించారు. యువ మోర్చా కార్యకర్తలు టిఎస్‌పిఎస్‌సి కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లి టిఎస్‌పిఎస్‌సి బోర్డును ధ్వంసం చేశారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని టిజెఎస్ డిమాండ్ చేసింది. టిఎస్‌పిఎస్‌పి కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించిన నేతలను అరెస్టు చేశారు. వరసగా ఆందోళనల దృష్టా అదనపు బలగాలు మోహరించాయి. టిఎస్‌పిఎస్‌సి వద్ద భద్రతను అదనపు సివి విక్రమ్ సింగ్ పర్యవేక్షించారు. పేపర్ లీకేజీ నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో పేపర్ లీకేజీ కేసు నిందితులు ఉన్నారు.
టిఎస్‌పిఎస్‌సి ఆఫీస్‌ను ముట్టడించిన టిజెఎస్, బిజెపి యువమోర్చా కార్యకర్తలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -