హైదరాబాద్: టిఎస్‌పిఎస్ ప్రశ్న పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ స్త్రీలోలుడిగా పోలీసులు తేల్చారు. 2017లో టిఎస్‌పిఎస్‌సిలో ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పని చేశారు. వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నంబర్లు తీసుకున్నాడు. దరఖాస్తు సమస్యలను పరిష్కరించడంతో సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకోవడంతో పాటు పలువురు మహిళలతో శారీరక సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
ప్రవీణ్ ఫోన్‌లో ఎక్కువ సంఖ్యలో మహిళల నంబర్లను గుర్తించడంతో పాటు వాట్సప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలను గుర్తించారు. ఎఇ పరీక్ష పత్రం కూడా రేణుక వల్లే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. సంవత్సరం క్రితం టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి పిఎగా ప్రవీణ్‌కు పదోన్నతి వచ్చింది. ఉన్నతాధికారుల వద్ద ప్రవీణ్ ఎంతో క్రమశిక్షణగా ఉన్నట్లు నటించేవాడు. నిందితులు ప్రవీణ్, రేణుక పోన్లలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పోలీసులు పంపారు. ఇద్దరు మధ్య జరిగిన పూర్తి చాటింగ్‌ను రికవరీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. రేణుక చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు తేల్చారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ పేపర్‌లను ప్రవీణ్ సంపాదించాడు. పేపర్లు చేతికి వచ్చినా ఒప్పందం కుదరకపోవడంతో అతడు ఎవరికీ అమ్మలేదు.
గతంలో ఏమైనా పేపర్లు లీక్ అయ్యాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అతడు రాశాడు. గ్రూప్1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను ప్రవీణ్ లీక్ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను టిఎస్‌పిఎస్‌సి అధికారులు పరిశీలిస్తున్నారు. 103 మార్కులు వచ్చినా మెయిన్స్‌కు ప్రవీణ్ అర్హత సాధించలేకపోయాడు. బబ్లింగ్ పొరపాటుతోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాదించలేదు. 150కు 103 మార్కులు వచ్చే ప్రతిభ ప్రవీణ్‌కు ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ వచ్చిన సర్వర్‌ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందా? లేదా అని పరిశీలిస్తున్నారు.
టిఎస్‌పిఎస్‌సి లీకేజీపై అదనపు సిపి విక్రమ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఎఇ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతోందని, ప్రవీణ్‌తో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు.