Wednesday, January 22, 2025

పేపర్ లీకేజీలో పెద్దల హస్తం ఉంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ మోర్చా నేతలపై అక్రమ కేసులు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. చంచల్‌గూడ జైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకొని బిజెపి యువ మోర్చా నేతలను పరామర్శించారు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నప్పుడు బిజెపి యువ మోర్చా నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని, తెలంగాణ యువత ఆక్రోశంతో ఉందన్నారు. పేపర్ లీకేజీలో పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. పేపర్ లీకేజీలో పెద్దల హస్తంపై విచారణ జరపాలని సవాలు విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శలు చేశారు. తెలంగాణలో మార్పు తీసుకవచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News