Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో నిందితుడిపై లుకౌట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

15కు చేరిన అరెస్టులు
ప్రవీణ్ ఇంట్లో
రూ.5లక్షలు స్వాధీనం
గ్రూప్-1 రాసిన
40మందిని ప్రశ్నించిన
సిట్ ఎఫిషియన్సీ
టెస్ట్ నిర్వహణ లీక్‌తో
సంబంధం లేదని నిర్ధారణ

రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌కు
లుక్ అవుట్ సర్కులర్ జారీ
15కు చేరిన అరెస్ట్‌లు.. ప్రవీణ్
ఇంట్లో రూ.5 లక్షలు స్వాధీనం
సిట్ రెండో రోజు కస్టడీలో
నోరు విప్పిన ప్రవీణ్
గ్రూప్ 1 రాసిన 40 మందిని
ప్రశ్నించిన సిట్ వారికి ఎఫిషియన్సీ
టెస్ట్ నిర్వహణ .. లీక్‌తో సంబంధం
లేదని నిర్ధారణ

మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసులో రాజశేఖర్ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా సమాచారం. ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉంటుండగా అతనికి రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం చేరింది. దీంతో ప్రశాంత్ అక్కడే పేపర్‌లో ప్రశ్నలకు జవాబులు ప్రిపేర్ అయి ఇక్కొడికి వచ్చి పరీక్ష రాశాడు. అనంతరం తిరగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు కూడా వచ్చినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు వాట్సాప్, మెయిల్ ద్వారా ప్రశాంత్‌ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు.

అయితే సిట్ అధికారులకు ప్రశాంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి కోసం సిట్ అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు. న్యూజిలాండ్ నుంచి ప్రశాంత్ ఇండియాకు తిరిగి వస్తే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు సిట్ బృందానికి సమాచారం పంపేందుకు గానూ ఈ నోటీసులు జారీచేసినట్టుగా తెలుస్తోంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో రెండో రోజు సిట్ కస్టడీ ముగిసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను సిట్ ప్రశ్నించింది. మరోవైపు గ్రూప్-1 పరీక్ష రాసిన 40 మందిని కూడా సిట్ ప్రశ్నించింది. 40 మందికి సిట్ అధికారులు ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష రాసిన 40 మందికి లీక్‌తో దాదాపు సంబంధం లేదని నిర్ధారించారు. సిట్ తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రవీణ్ నోరు విప్పినట్లు సమాచారం. నిందితుడు ప్రవీణ్ ఇంట్లో 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనంగా శంకర్‌లక్ష్మి డైరీలోని పాస్‌వర్డ్ తెలుసుకుని కంప్యూటర్‌లో డేటా చోరీ చేసినట్లు తేల్చింది. రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ పొందాడు. ఏఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో దళారీగా వ్యవహరించిన డాక్యా నుంచి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని రాజేందర్‌కు విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు డాక్యా అండ్ గ్యాంగ్ బ్లాక్ టికెట్ల మాదిరిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి సమకూర్చుకునే క్రమంలో చెయిన్ ప్రాసెస్‌లో కొనుగోలు పెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన రాజేంద్రకు రూ.10 లక్షలు ఒప్పందం కింద డాక్యా ఏఈ పేపర్ అమ్మినట్లు తెలిసింది. ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన రాజేంద్ర ఆ పేపర్‌ను వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒకరి నుంచి ఒకరికి దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్లు భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. కాగా రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు.

100మార్కులు సాధించిన వారిపై దృష్టి

ఇదిలా ఉండగా, సిట్ అధికారులు గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మా ర్కులకు గానూ వందకు పైగా మార్కులు సాధించిన అ భ్యర్థులందరి జాబితాను సేకరించారు. ఇందులో సిట్ అధికారులు పలువురిని విచారణకు పిలుస్తున్నారు. వీరి ని విచారించేందుకు 15 ప్రశ్నలతో కూడిన జబితాను సి ద్దం చేశారు. వారి ప్రస్తుత ఉద్యోగం, పోటీ పరీక్షలు, గతంలో వారు రాసిన టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు వాటిలో సాధించిన మార్కుల గురించి వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం

టిఎస్‌పిఎస్‌సి సమావేశం ముగిసింది. వచ్చేనెల జరగాల్సిన పరీక్షలపై సమావేశంలో చర్చించారు. అలాగే ఉ ద్యోగుల నిబంధనలు, సిట్ దర్యాప్తు నివేదికపై చర్చ జరిగింది. ఉద్యోగుల నిబంధనలను కఠినతరం చేసిన టిఎస్‌పిఎస్‌సి సెల్‌lఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు అనుమతి నిరాకరించారు. సెక్యూరిటీ దగ్గరే డిపాజిట్ చేసి విధులు నిర్వహించేలా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సెలవులను కిష్టతరం చేసినట్లు సమాచారం. సరైన కారణంతోనే సెలవుకు అనుమతి తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News