Wednesday, April 2, 2025

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సిట్ అధికారులు అజ్మీరా పృథ్వీరాజ్, రాజేశ్వర్ జాదవ్‌లను అరెస్టు చేశారు. పృథ్వీరాజ్ ఖమ్మం జిల్లా చిన్న మాదంపల్లిలో జెపిఎస్‌గా పని చేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని నార్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో రాజేశ్వర్ పని చేస్తున్నారు. ఇద్దరు నిందితులు మురళీధర్ అనే వ్యక్తి నుంచి పేపర్‌ను కొనుగోలు చేశారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రం లీక్ కేసులో ఇప్పటి వరకు 35 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: 84 గ్రామాల్లో ఇక రియల్ బూమ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News