Monday, December 23, 2024

గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులు దాటిన వారిని విచారించాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులు దాటిన వారిని విచారించాలని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీలో అధికారి శంకర లక్ష్మి పాత్ర ఏంటో బయటపెట్టాలని సవాలు విసిరారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. జైలులో లీకేజీ కేసు నిందితులను బెదిరించారని, పెద్దల పేర్లు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. దర్యాప్తు జరగకుండానే ఇద్దరు తప్పు చేశారని ప్రభుత్వం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. టిఎస్‌పిఎస్‌సిలో పని చేస్తున్నవారికి పరీక్షలు రాసే అర్హత లేదు అని, టిఎస్‌పిఎస్‌సిలో పని చేస్తున్న 20 మంది పరీక్షలు ఎలా రాశారని అడిగారు. గతంలో టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగి రజినీకాంత్ గ్రూప్ 1కు ఎంపికయ్యారనిరేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News