Thursday, January 23, 2025

పేపర్ లీక్ కేసులో ట్విస్ట్..తెరపైకి కొత్త పేర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి మరికొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు సురేష్ పాత్రపై సిట్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టిఎస్‌పిఎస్‌సి నుంచి ఇతనే పేపర్‌ను బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సురేష్ ఎంతమందికి పేపర్ ఇచ్చాడన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్‌ల పెన్‌డ్రైవ్ల్‌లో సమాచారం లీకైనట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ వాట్సాప్ చాటా ఆరా తీసింది. అలాగే టిఎస్‌పిఎస్‌సిలో పనిచేస్తున్న 42 మందికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం 9 మంది నిందితులను 7 గంటల పాటు సిట్ ప్రశ్నించింది . దీనితో పాటు పలు అంశాలపై ఆధారాలను సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్ సేకరించింది.

మరోవైపు ఈ కేసులో అరెస్టైన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్, రేణుక ఆమె భర్త ఢాక్యానాయక్ బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలించింది. ఇటీవల కాలంలో ఈ నిందితుల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయా? అనే కోణంలో కూడా సిట్ ఆరా తీస్తోంది. ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సురేష్‌ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ విచారిస్తున్న సురేష్‌కు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులు వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం విక్రయించి రేణుక డబ్బులు సంపాదించిందని గుర్తించింది. నీలేష్, గోపాల్ లకు ప్రశ్నాపత్రాలు ఇచ్చి రూ. 14 లక్షలను రేణుక తీసుకుందని గుర్తించింది.

టిఎస్‌పిఎస్‌సి కాన్పిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండ్ శంకర్‌లక్ష్మిని సిట్ అధికారులు మంగళవారం రాత్రి విచారించారు. శంకరలక్ష్మీ ఇచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ల నుండి పెన్ డ్రైవ్ లను సిట్ బృందం సీజ్ చేసింది. ఈ పెన్ డ్రైవ్ లలో ప్రశ్నాపత్రాలు ఉన్నట్టుగా సిట్ బృందం గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News