Monday, January 20, 2025

గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అంతకుముందు, గతంలో 503 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్‌ లో మరో 60 పోస్టులను జతచేసిన టిఎస్పిఎస్సి.. మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించింది.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక, మే/జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్/అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News