హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల జాతర సాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 సహా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా భారీగా ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎఇఇ) పోస్టుల భర్తీకి శనివారం టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 14 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నియామకాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15న విడుదల చేయనున్నా రు. ఒకేసారి 1,540 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటం పట్ల ఇంజనీరింగ్ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత 30 ఏళ్లలో ఒకేసారి ఇన్ని ఇంజనీరింగ్ పోస్టులు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదని పేర్కొంటున్నారు.
ఎఎంవిఐ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
రాష్ట్ర రవాణా శాఖలో అసిస్టెంట్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎఎంవిఐ) పోస్టుల భర్తీకి జారీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. అర్హతల విషయంఓనూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని రవాణాశాఖకు తెలియజేసినట్లు వివరించారు. 113 ఎఎంవి పోస్టుల భర్తీకి జులై 27న టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
శాఖల వారీగా ఉద్యోగాల వివరాలు
పంచాయతీరాజ్ శాఖ (మిషన్ భగీరథ) 302
పంచాయతీరాజ్ శాఖ 211
పురపాలక శాఖ 147
గిరిజన సంక్షేమ శాఖ 15
ఇరిగేషన్ విభాగంలో 704
మొత్తం 1540
TSPSC Released Notification for 1540 AEE Vacancies