Friday, November 22, 2024

గ్రూప్ పరీక్షలకు వేళాయే..!

- Advertisement -
- Advertisement -

గ్రూప్ 1,2,3 పరీక్ష తేదీలు ఖరారు ఆగస్టు
7,8 తేదీల్లో గ్రూప్2, అక్టోబర్ 21నుంచి
గ్రూప్1మెయిన్స్ నవంబర్ 17,18 తేదీల్లో
గ్రూప్-3 పరీక్షలు పరీక్షల షెడ్యూల్
ప్రకటించిన టిఎస్‌పిఎస్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కు టిఎస్‌పిఎస్‌సి శుభవార్త చె ప్పింది. గ్రూప్-2, గ్రూప్-3 పరీ క్ష తేదీలతోపాటు గ్రూప్-1 మె యిన్స్ తేదీలను టిఎస్‌పిఎస్‌సి ప్ర కటించింది. ప్రకటించింది. ఆగ స్టు 7,8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్ష ను నిర్వహించనున్నట్లు తెలంగా ణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తెలిపింది. నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షను నిర్వహించనున్నారు.అలాగే అక్టోబరు 21 నుం చి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బుధవారం టిఎస్‌పిఎస్‌సి ప్రకటన విడుదల చేసింది.

గ్రూప్-1కు 563 పోస్టు లు, గ్రూప్ -2కు 783 పోస్టులు, గ్రూప్ 3కి 1,388 పోస్టుల భర్తీ కి టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు నిర్వహించనుంది. గత నెల 24వ తే దీనగ్రూప్1 నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్‌పిఎస్‌సి, ఇప్పటికే జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా, దరఖాస్తుల సమర్పణకు మార్చి 14 చివరి తేదీగా కమిషన్ నిర్ణయించింది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి మార్చి 27 సాయంత్రం 5 గంటల వరకు సరిచేసుకోవచ్చని టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌లో తెలిపింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.

గ్రూప్ 2 పరీక్ష ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడింది. మొదట గతేడాది ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్ష నిర్వహించడానికి కమిషన్ సన్నాహకాలు చేసింది. అయితే ఆ సమయంలో మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో నవంబరు 2,3 తేదీలకు వాయిదా వేశారు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో గ్రూప్ 2 పరీక్షలను 2024 జనవరి 6,7 తేదీలకు మార్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపత్యంలో ఈ ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్ -2 పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసింది. ఈ పరీక్షలకు సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టిఎస్‌పిఎస్‌సి కమిషన్ సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ కొలువుతీరింది. తాజాగా ఆగస్టు 7,8 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News