Sunday, December 22, 2024

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల

- Advertisement -
- Advertisement -

TSPSC Group 1 Prelims 2022 Key Released

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల
నవంబర్ 4 వరకు అభ్యంతరాల స్వీకరణ
ప్రిమిలినరీ ‘కీ’తో పాటు ఒఎంఆర్ షీట్లను
వెబ్‌సైట్‌లో పొందుపరిచిన కమిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. ప్రాథమిక కీ తోపాటు అభ్యర్థుల ఒఎంర్ షీట్లను టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది. ఆదివారం(అక్టోబర్ 31) నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రిమిలినరీ పై అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ లింకు ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదు చేయాలని పేర్కొంది. ఈమెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలు తెలిపే సమయంలో అందుకు సంబంధించిన ఆధారాల కాపీలను పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది. నవంబర్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ఒఎంఆర్ పత్రాలు అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత ఉండవని తెలిపింది.
అభ్యంతరాల స్వీకరణ తర్వాత 503 పోస్టుల్లో ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి నిర్వహించింది. దీనికి 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో టిఎస్‌పిఎస్‌సి తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నెంబర్ సిరీస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ధతిలో జవాబులు అడిగారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ ని కమిషన్ విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

TSPSC Group 1 Prelims 2022 Key Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News