Monday, December 23, 2024

జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్- 1 ప్రిలిమినరీ నిర్వహణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఒఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

తెలంగాణ తొలి గ్రూప్-1 కింద అత్యధికంగా 503 ఉద్యోగాలతో టిఎస్‌పిఎస్‌సి గత ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి, జూన్ 11న తిరిగి నిర్వహిస్తున్నారు.

అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు ఆ పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News