Monday, January 20, 2025

పరీక్షకు 15నిమిషాల ముందు గేట్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

TSPSC to hold Group-1 Prelims on Oct 16

హాల్ టిక్కెట్‌లో తప్పులుంటే గెజిటేడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి
గ్రూప్-1 పరీక్షపై టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 16న గ్రూప్ 1 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులుంటే సంబంధిత అభ్యర్థి గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకుని రావాలని సూచించారు. పరీక్ష సమయానికి 15 నిముషాల ముందే గేట్లు మూసివేస్తారని నిర్ణీత సమయానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్1 పరీక్షకు తొలిసారిగా బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని ఆయన చెప్పారు.

TSPSC to hold Group-1 Prelims on Oct 16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News