Friday, January 10, 2025

మొక్కలు నాటిన టిఎస్‌ఆర్‌డిసి చైర్మన్ మెట్టు శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టినగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎర్రమంజిల్ కాలనీలోని తన కార్యాలయ ఆవరణలో తెలంగాణ స్టేట్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్. మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు కొండ దేవయ్య, పుట్టం పురుషోత్తంరావు. కుమార్ ముచ్చ కుర్తి,ముచ్చ కుర్తి ప్రభాకర్, రాజేందర్ తదితరులు ఉన్నారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలి : మౌనిక నాయక్
తన జన్మదినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసం మాదాపూర్‌లో యువర్స్ ఫౌండేషన్ చైర్మన్, గిరిజన డెవలప్మెంట్ ఫోరం మహిళా చైర్మన్ మౌనిక నాయక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మౌనిక నాయర్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

Mounika

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News