Thursday, December 19, 2024

కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ఎవరో?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే తెలంగాణలో ఆ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరో ఖమ్మం సభకు వస్తున్న రాహుల్ గాంధీ చెప్పాలని టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో ఈ డిక్లరేషన్.. ఆ డిక్లరేషన్ కాదు.. సిఎం డిక్లరేషన్ చేయాలని సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కెసిఆర్ మళ్లీ సిఎం అభ్యర్థి అని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ క్లారిటీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సిఎం క్యాండిడేట్ అనేది సభలో రాహుల్ ప్రకటించి వెళ్లాలన్నారు.

ప్రజలు 5 రూపాయల పేస్ట్ కూడా బ్రాండ్ చూసి కొంటారని.. అలాంటిది నాయకుడు ఎవరో తెలియని పార్టీకి ఓటేసి అధికారం కట్టబెడతారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. కబ్జాకోరులు, దళారులు, బ్లాక్ మెయిలర్లకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోరన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఇప్పటికీ మానని గాయంలా ప్రజలను బాధ పెడుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో భూమి అడిగిన పేదలపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కషంగా గుళ్ల వర్షం కురిపించి వారిని పొట్టనపెట్టుకున్న ఘటన ఇప్పటికీ కళ్లముందే తిరుగుతోందన్నారు.

కాంగ్రెస్ పాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందనే దానికి ఆనాడు కాల్పుల్లో గాయపడిన వారే ప్రత్యక్ష సాక్ష్యమని వై. సతీష్ రెడ్డి అన్నారు. ఆనాడు కాల్చి చంపిన నేలపైనే సభ పెడుతున్న రాహుల్ గాంధీ ఆ అమరుల కుటుంబాలకు, అడవి బిడ్డలకు క్షమాపణలు చెప్పాకే తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పొరుగునే ఉన్న చత్తీస్ గఢ్, అటు రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ 60 ఏళ్లలో గిరిపుత్రులను పట్టించుకోలేదని, పోడు భూముల గురించి ఆలోచన చేయలేదని.. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ పోడు భూములకు పట్టాలిచ్చి వారికి రైతుబంధు, రైతుబీమా, నీటి వసతి కోసం బోర్లు, వాటికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి గిరిపుత్రులను సిరిపుత్రులుగా చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News